Skip to main content

Posts

Showing posts from November, 2016

జాతీయ బాలల దినోత్సవం -2016

A set of 2 stamp and a miniature sheet was released by India Post on 14th November 2016 as part of Children's day with the theme "Picnic" జాతీయ బాలల దినోత్సవం -2016  ప్రతి సంవత్సరం నవంబర్ 14 న పండిట్ నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళల పై ముద్రిస్తారు.  అలాగే ఈ ఏడాది   తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో పిక్నిక్ అనే అంశంపై వచ్చిన  ఉత్తమ చిత్రాలన్ని  బాలల దినోత్సవం   14-11-2013న ప్రత్యక తపాలా బిళ్ళల గా  విడుదల చేసారు.

జాతీయ ఐక్యతా దినం - సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం

జాతీయ ఐక్యతాదినంగా సర్దార్ వల్లభాయ్ పటేల్  జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా  31-10-2016 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేసింది.  చీలికలు పీలికలు గా ఉన్న భారత దేశానికి ఒక సమగ్రతను సమకూర్చి  ఉక్కు మనిషిగా పేరొందిన పటేల్ గారి  జయంతిని (అక్టోబర్ 31) నేడు దేశ సమగ్రతా దినం గా జరుపుకుంటున్నాం.  సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ మొదటి ఉప ప్రధాని, గృహ మంత్రి గా 560 పైగా ఉన్న సంస్థానాలను భారత్ లో విలీనంలో కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం మన తపాలా శాఖ ఇప్పటివరకు విడుదల చేసిన తపాలా బిళ్ళలు.  Vallabhai Patel ( 31 October 1965 ) - 90th Birth Anniversary 31 October 1975-  Vallabhai Patel  - Birth Centenary 15 December 1997- Sardar Vallab Bhai Patel 27 November 2008 -Sardar Vallabhbhai Patel National Police Academy Hyderabad DEFINITIVE STAMP - ISSUED ON 23 JAN 2001 DEFINITIVE STAMP - ISSUED ON  19 -05- 2016