Skip to main content

Posts

Showing posts from January, 2016

GUNTUR PEX-2016

భారత తపాల శాఖ 8 మరియు 9 -2-2016 తేదిలలో గుంటూరు లో GUNTURPEX -2016 పేరుతో  తపాల బిళ్ళలు  ప్రదర్శన పోటి జరుపుతున్నారు. గుంటూరు జిల్లావాసులు మాత్రమే ఈ పోటికి అర్హులు.  గుంటూరు  బృందావన్  గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ లోని బాలాజీ మంటపం లో రెండు   రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో తపాలా బిళ్ళల సేకరణ దారులచే అరుదైన  వివిధ దేశాల తపాలా బిళ్ళలు ప్రదర్శించ బడతాయి.   ప్రవేశం ఉచితం.

తపాలబిళ్ళలపై తెలుగు వెలుగులేవి?

తపాల బిళ్ళ అనేది ఒక జాతి కీర్తి పతాకం. ఒక  గౌరవ చిహ్నం. చరిత్రకు దర్పణం. తమ జాతిసంస్కృతి , సాంప్రదాయాలపైన , వేష భాషల పైన , కళలపైన,  వైతాళికుల పైన ప్రత్యేక  తపాలా బిళ్లలను ఆయా దేశాలు వారు  ముద్రిస్తారు .  వీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగాఉండే తపాల బిళ్ళల  సేకరణకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు . మరి మన తెలుగు జాతి సంస్కృతి కి చరిత్రకి మన దేశపు తపాలా బిళ్ళలు దర్పణం పడుతున్నాయా అన్నది ప్రశ్నార్ధకమే.  మన పోస్టల్ శాఖ వారు వెలువరించిన  తపాల బిళ్ళల గురించి  తెలుసుకుంటే ఈ విషయంలో మన  తెలుగువారిపై   ఎంత  వివక్ష ఉన్నదో  అవగతం అవుతుంది .  భారత ప్రభుత్వం ఇప్పటి వరకు వెలువరించిన షుమారు   2550  పోస్టల్  స్టాంప్స్ లో తెలుగు వారి పైన , తెలుగు జాతి  సంస్కృతి   పైన 68ఏళ్లలో విడుదల చేసిన తపాలా బిళ్లలు    కేవలం   50 లోపు  మాత్రమే.  విడుదల అయిన ఈ తపాల బిళ్ళల లో  కుడా మన వారి కృషి కంటే మన ప్రక్క న ఉన్న తమిళనాట ఉన్న  తెలుగు  సోదరుల కృషే ఎక్కువ.  రాజకీయాలకు అతీతంగా  రాష్ట్రపతి ,   ప్రధాన   మంత్రి   వంటి   వారికి , వారి   మరణాన్తరం ప్రత్యేక   తపాల  బిళ్ళలు    విడ

LIST OF STAMPS ISSUED BY INDIA POST IN 2015

మన తపాల శాఖ 2015 లో విడుదల చేసిన మొత్తం తపాల బిళ్ళలు 49 వీటి విలువ Rs 380/-మరియు Rs 240/-  విలువ గల 9 మినియెచర్లు కుడా విడుదల చేసారు  వాటి వివరాలు