Skip to main content

Posts

Showing posts from March, 2014

విజయవాడ లో తపాల బిళ్ళల ప్రదర్శన

KRISHNAPEX -2014  కృష్ణ పెక్స్ -2014  పేరుతో  తపాలా శాఖ వారి సహకారం తో  విజయవాడ లో 14-3-2014న  కృష్ణ జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శన విజయవాడ ఇన్స్టిట్యూషన్ అఫ్ ఇంజనీర్స్ వారి "K. L రావు భవన్" గవర్నర్ పేట లో ఏర్పాటు చేశారు. దీనిని శ్రీ బి.వి. సుధాకర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ , జనరల్ . ఆంద్ర ప్రదేశ్ సర్కిల్  వారు ప్రారంభిస్తారు అని శ్రీ యం. సంపత్ ,  పోస్ట్ మాస్టర్ , జనరల్ విజయవాడ,  వారు తెలియజేస్తున్నారు. ఈ ప్రదర్శన ఏర్పాటుకు గుంటూరు తపాల బిళ్ళలు నాణేలు సేకరణ సంఘం (GNPS) వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. 

తిరుపతిలో ' ఫిలటేలి బ్యూరో'

ఆంధ్ర ప్రదేశ్ లో తపాలా బిళ్ళలు సేకరణ దారులకోరకు మన తపాల శాఖ వారు కొన్ని ముఖ్య ప్రదేశాలలో ప్రత్యక తపాలా కార్యాలయాలు ఎర్పరిచారు. మన రాష్ట్రంలో ఇప్పటకే  హైదరాబాద్, కర్నూల్, విజయవాడ, విశాఖ పట్నం నగరాలలో ఫిలాటాలి శాఖలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు  కొత్తగా తిరుపతిలో 1-3-2014 న మరొక' ఫిలటేలి బ్యూరో' ప్రారంబించారు.  తపాలా బిళ్ళలు సేకరించే వారు ఆయా తపాలా కార్యాలయాలో కొత్తగా విడుదల చేసే తపాలా బిళ్ళలు, ప్రత్యేక తపాలా కవర్లు వీటిలో కొనుగోలు చేయవచ్చు.  ' ఫిలటేలి బ్యూరో' ఉన్న ప్రదేశాలలో ఎవరైనా Rs.  200/- తో ఖాతా తెరిచి వారికి కావలిసిన తపాలా బిళ్ళలు  కొనవచ్చు.  వీటిని పోస్ట్ లో మన ఇంటికి తపాలా ఖర్చులు లేకుండా    పంపుతారు.   ఫిలాటాలి శాఖ లేని ప్రదేశాలలో మామూలు కౌంటర్ లో ఈ తపాలా బిళ్ళలను పొందవచ్చు.  మన అవిభక్త ఆంద్రప్రదేశ్ లో ఈ ఫిలటాలి కార్యాలయాలు ఉన్న ప్రాంతాలను కింది పట్టికలో చూడగలరు.   List of Philately Offices in A.P.Circle Office With Pincode Office Category    Telephone             Email 1.  Hyderabad G.P.O. ---500001 Philatelic Bureau 040-23463517

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.