Skip to main content

Posts

Showing posts from October, 2013

అమరజీవి పొట్టి శ్రీరాములు

India post issued a Commemorative postage stamp  on freedom fighter, social worker  Amarajivi  POTTI SRIRAMULU on  16 - 3 - 2000 POTTI SRIRAMULU ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు (1901-1952) ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మ గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. స్వతంత్ర సమర యోధుడు .  ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19 న మహర్షి బులుసు సాంబ మూర్తి గారి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు .56 రోజులు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15  న  పొట్టి శ్రీరాములు, ఆంద్ర రాష్ట్ర ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్దం తపాల శాఖ వారు 16 మార్చ్ 2000 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు . FDC -POTTI SRIRAMULU

Two Special Covers released at Hyderabad

50 Glorious Years in Wild Life -  Nehru Zoological Park , Hyderabad   A Special Cover  released  by India Post on  06.10.2013. Diamond Jubilee of  Begumpet  Air Force Station (1953-2013)-  Hyderabad   A Special Cover  released  by  Army  postal service on  08.10.2013.

దైవ కణం గురించి ప్రతిపాదించిన సత్యేంద్రనాథ్ బోస్

India Post released a stamp on Satyendranath Bose on 1-1-1994.   Satyendranath Bose (1894-1974) మన దేశం గర్వించదగిన శాస్త్రవేత్త లలో సత్యేంద్ర నాద బోసు ఒకరు. వారి శతజయంతి సందర్బంగా మన తపాలా శాఖ 1-1-1994 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేసింది . వారు బౌతిక శాస్త్రం లో చేసిన కృషి నేడు పరోక్షంగా నోబెల్ బహుమతికి నోచుకుంది.  2013 సంవత్సరానికి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్   దైవ కణం గురించి ప్రతిపాదించిన పీటర్  హిగ్స్,ఇంగ్లర్ట్ లకు లభించింది.1964 లో వీరితోపాటు రాబర్ట్ బ్రోట్  కూడా ఉన్నారు తరువాత  పీటర్ర్ హిగ్స్ విశేష పరిశోధన చేసారు వీరితొ  పాటు కార్ల్ హెగెన్,గెరాల్డ్, టామ్ కిబ్ల్ కూడా దీని ఉనికిని ప్రతిపాదించారు.            ఈ  నోబెల్ బహుమతి లో  గమనించాల్సిన ముఖ్య విషయమమేమంటే మన దేశానికి చెందిన ప్రసిద్ద శాస్త్రవేత్త, పద్మ విభూషణ్  సత్యేంద్రనాథ్ బోస్ చేసిన కృషి. ఈ దైవ  కణం ఉనికిని 1926  ప్రాంతంలోనే వారు ప్రతిపాదించారు. ఈయన పేరుతోనే దీనికి బోసాన్ అనిపేరు వచ్చింది.  ఈ కణం నుండే సృష్టిలోని గ్రహాలూ,నక్షత్రాల వరకు సమస్త పదార్దానికి ద్రవ్యరాశి చేకూరుతుంది.   స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప

అహింసా మూర్తికి ఘన నివాళి - One more Souvenir Sheet On Gandhiji

India Post released New Souvenir Sheet on the occasion of   "Philately day 2013" on 12th October 2013. The Souvenir Sheet Shows two stamps of Mahatma Gandhi Issued by India Post in 1948 (12A) and 1969 (75) Souvenir Sheet  – Philately Day – Mahatma Gandhi మన తపాలా బిళ్ళల లో  సింహ భాగం మహాత్మా గాంధీ పైనే విడుదల చేసారు. తపాలా బిళ్ళల సేకరణలో మహాత్మా గాంధీజీ తపాలా బిళ్ళ లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది . ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ అహింసా మూర్తిని తమ తపాలా బిళ్ళ ల పై ముద్రించి గౌరవించాయి. వీటిని సేకరించటానికి పలు దేశాలలో తపాల బిళ్ళ ల సేకరణ దారులు తహతహ లాడుతుంటారు. పాత తపాల బిళ్ళలు అందరికి అందుబాటులో ఉండటానికి ఇలా ప్రత్యేక స్మారక తపాలా చిత్రం ( Stamps on Stamp) విడుదల చేస్తారు.    తపాలా బిళ్ళల సేకరణ దినోత్సవం సందర్బం గా 12-10-2013 న మన తపాలా శాఖ ఒక సావనీర్ షీట్ (  స్మారక తపాలా చిత్రం ) విడుదల చేసింది. దిని పై మాహాత్మ గాంధీ చిత్రం తో పాటు 1948 లో విడుదలైన 12 అణాల గాంధీ తపాలా బిళ్ళ ,1969 లో విడుదలైన 75 పైసల గాంధీ తపాలా బిళ్ళలు ఉండేలా 20 రూపాయల తపాలా బిళ్ళ ను రూపొందించార