Skip to main content

Posts

Showing posts from April, 2013

శ్రీ కూర్మం కుర్మానాధ దేవాలయం - శ్రీకాకుళం

India post Issued a set of two postage stamps and one miniature sheet on  Srikurmam and   Arassavalli  Temples in Srikakulam Dist. Andra Pradesh on the occasion of Telugu new year "Ugadi" on 11-04-1213.  These set of stamps and Miniature have been released in the series of Architectural Heritage of India. ARCHITECTURAL HERITAGE OF INDIA - M.S ARASAVALLI - SRI KURMAM TEMPLES మన భారత తపాలా శాఖ 11-04-2013 న  భారతీయ శిల్ప కళా సంపద లో భాగం గా  "Architectural Heritage of India " పేరుతో తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున  మన రాష్ట్రం లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రెండు ప్రాచీన దేవాలయాల పై రెండు తపాలా బిళ్ళలు  మరియు ఒక మినియెచర్ ను విడుదల చేసింది. వీటిపై 20 రూపాయల విలువ గల తపాలా బిళ్ళపైన అరసవల్లి సూర్య దేవాలయం , 5 రూపాయల విలువ గల మరొక తపాలా బిళ్ళ పైన  శ్రీకూర్మం లోని కూర్మనాధ స్వామీ ఆలయం చోటు చేసుకున్నాయి. ఇవి రెండు జంట గా అందమైన మరో 25 రూపాయల మినియెచర్ కుడా విడుదల చేసారు.  ARCHITECTURAL HERITAGE OF INDIA - FDC ఇంతకు ముందు మన తెలునాట ఉన్న సుప్రసిద్ద దేవాలయాలు అయి

INDIAN HERITAGE BUILDINGS

India Post released a set of Two  stamps  and a Miniature Sheet to commemorate 100 years of Mumbai GPO and Agra Head Post Office Buildings,under the heading of "HERITAGE BUILDINGS" on 12th April 2013. Mumbai and Agra Post Office Buildings  మన భారత తపాల శాఖ 12 - 04 -1213 న 'హెరిటేజ్ బిల్డింగ్స్' పేరుతో ముంబాయి, ఆగ్రా ప్రధాన తపాల కార్యాలయాలు నూరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా  రెండు తపాలా బిళ్ళలు ఒక మినిఎచర్ ను విడుదల చేసింది.  ఈ మినిఎచర్ పై 1948 లో విడుదలైన మహాత్మా గాంధీ తపాలా బిళ్ళ తో ఉన్న ప్ర్రత్యేక తపాలా కవర్ ను చూడవచ్చు. 

తపాల బిళ్ళ పై శ్రీశైలం మల్లన్న గుడి

India Post Issued  a set of Four  Commemorative postage stamps  on    15  - 5  - 2003 One of the Stamps shows Mallikarjuna   swami   temple   - SRISAILAM and remainig   three stamps are on other Hindu temples at Bhadrinath, Udayapur, puri. Mallikarjuna   swami   temple   - SRISAILAM Mallikarjuna   swami   temple   - SRISAILAM - FDC  ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన శ్రీశైల మల్లిఖార్జున స్వామి దేవాలయం పై మన భారత తపాల శాఖ   15 - 5 - 2003  న  ఒక తపాల బిళ్ళవిడుదల చేసింది. మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా లో నలమల కొండల పై ఉన్న ఈ   దేవాలయము  అభేద్యమైన ప్రాకారము కలిగి  లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో చూడ ముచ్చటగా ఉంటుంది.  ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా  చాలా సాధారణ నిర్మాణం తో ఉంటుంది.  దీనితో పాటు మన దేశ దేవాలయ శిల్ప కళ వైశిస్టాన్ని ప్రతిబింబించేలా విడుదల చేసిన మరో మూడు  తపాల బిళ్ళలలో చోటుచేసుకున్న ప్రముఖ హిందూ దేవాలయాలు -  1. బదరినాద్ లోని విశాల్ బదరినాద్ దేవాలయం,  2. త్రిపుర లోని త్రిపురేశ్వరి దేవాలయం(ఉదయపూర్), 3. పూరి లోని జగన్నాధ

తపాల బిళ్ళ పై తిరుమల ఆనంద నిలయం

India post Issued a Commemorative postage stamp on  ANANDA NILAYAM VIMANAM,TIRUMALA, on  11  -  10  -  2002 ఆనంద   నిలయం విమానం  మన దేశం లో అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయం తిరుపతి సమీపం లో ఉన్న తిరుమల లో ఉన్న  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం.  ఏడు కొండల పై కొలువున్న తిరుమల గిరి వాసుడు శ్రీనివాసుడు . ఆ శ్రీనివాసుని నివాసాన్ని ( గర్బ   గుడి )  ' ఆనంద నిలయం '  అంటారు. గుడి పై ఉండే   గోపురాన్ని  విమానం అని అంటారు . మన తపాలా శాఖ వారు బంగారు తాపడం తో కాంతులినే ఈ  శ్రీ వారి ఆనంద నిలయ  విమాన గోపురం తో ఉన్న ఈ 15 రూపాయల తపాల బిళ్ళ  ను   11 - 10 - 2002  న    విడుదల చేసారు .మొదటి రోజు విడుదల చేసిన కవర్ పై కొండను చేరుకొనే సుదరమైన కాలి బాట ను చిత్రించారు.  ANANDA NILAYAM VIMANAM,TIRUMALA- FDC 

అరుదైన పక్షి -కలివి కోడి - Jerdon's Courser

Jerdon ' S Courser Date of issue : 07-10-1988 జేర్దోన్స్ కోర్సెర్ అనే కలివి కోడి మన రాష్ట్రంలో తూర్పు కనుమలలో మాత్రమే జీవించుతూ త్వరలో అంతరించి పోతున్న జాతి చెందిన పక్షి . కడప , అనంతపూరు , బద్రాచలం అడవి ప్రాంతం లో మాత్రమే అరుదుగా కనిపించే ఈ పక్షి ని 1986 లో శాత్రవేత్తలు చూడటం తటస్త పడినది .  ఒక అంచనా ప్రకారం ఈ పక్షులు ఇప్పుడు కేవలం పదుల సంఖ్యల లోనే ఉన్నాయి . తెలుగు గంగ కాలవ పనులతో ఈ పక్షులకు హాని కలిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అటవీ శాఖ వారు ప్రాజెక్ట్ పనులకు అభ్యంతరాలు తెలిపారు. అయినా స్వల్ప మార్పులతో తెలుగు గంగ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ అరుదైన పక్షులను కాపాడాలన్న ఉద్దేశంతో తపాల శాఖా ఒక తపాల బిళ్ళను 07-10-1988 న విడుదల చేసింది . ఈ కలివి కోడి ని మన రాష్ట్రం లో తొలిసారి గుర్తించి న మన దేశ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్  సలీం అలీ ని ఫస్ట్ డే కవర్ పై చూడవచ్చు.  Jerdon's Courser - FDC  1-10-2005 లో కడప జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శనలో ( CUDDAPEX - 2005 ) తపాల శాఖ ఒక ప్రత్యక కవరును  విడుదల చేసింది. ఈ కవర్ పై

పెరు దేశపు తపాల బిళ్ళ పై తాజ్ మహల్

పెరు -  భారత్  దేశల మధ్య ద్వైపాక్షిక సంభందాలకు 50 ఏళ్ళు నిండిన సందర్బంగా 25 - 03- 2013 న పెరు దేశం జంట  తపాలా బిళ్ళలు (se-tenant)విడుదల చేసింది. వాటిపై ప్రపంచ వింతల లో చోటు చేసుకున్నరెండు దేశాలలో ఉన్న కట్టడాలు చోటు చెసుకున్నాయి.  పెరు దేశం లో ఉన్న మచ్చు- పిచ్చు  పర్వతాల పై ఉన్న రాజ ప్రసాదాలు ఒక తపాలా బిళ్ళ పైనా , మన దేశం లో ప్రఖ్యాత కట్టడం అయిన తాజ్ మహల్ ను మరొక తపాలా బిళ్ళ పైన ముద్రించారు. భారత్ - పెరు  దేశల మధ్య ద్వైపాక్షిక సంభందాలకు 50 ఏళ్ళు నిండిన సందర్బంగా  మన దేశం కుడా ఈ అంశం పై త్వరలో రెండు తపాలా బిళ్ళలు విడుదల చేస్తుంది.