Skip to main content

Posts

Showing posts from July, 2010

తిరుమల - ప్రత్యేక పోస్టల్ ముద్ర

Special Cover : THIRUMALA - PICTORIAL POSTMARK   Date of Issue : 06-11-1976 తిరుమల  శ్రీ వేంకటేశ్వరాలయం చరిత్ర లో మనకు వెంటనే స్పురించే వారిలో మొదటి వాడు అన్నమయ్య అయితే రెండోవవాడు శ్రీ కృష్ణ దేవరాయలు.శ్రీ కృష్ణ దేవరారాలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల మాట ఎటు తెలకపోయిన వారి విగ్రహాలు మాత్రం గుడిలో బద్రంగా ఉన్నాయి. రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా తెలుగు వారు వారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం ముదావహం. తిరుమల  తపాల కార్యాలయానికి కేటాయించిన ప్రత్యేక పోస్టల్ ముద్ర లో పద కవితా పితామహుడు అన్నమయ్య చిత్రం,ఆసందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవరు పై శ్రీవారి ఆనందనిలయం లో ముఖిళిత హస్తాలతో దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవారాయల కాంస్య విగ్రహాలు చిత్రించారు.  రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా   వారిపై త్వరలో ఒక తపాలా బిళ్ళ కుడా విడుదల చేయబోతున్నారు.

మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ - ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలు

MEGHADOOT POST  CARDS  - Dwrakaa Tirumala and Simhachalam  శ్రీ వెంకటేశ్వర ఆలయం,ద్వారకా తిరుమల  శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి   దేవాలయం,సింహాచలం  అన్ని దానాలలోకి అన్న దానం మిన్న అనేది నానుడి. దేవాలయాలో భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రం అనేది ఒక పుణ్య కార్యంగా తలచి మన రాష్ట్రంలో అన్ని ముఖ్య దేవాలయాలలో ఒక పధకం ప్రవేశపెట్టారు. దీనికి విరాళాలు ఇవ్వవలిసినదిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆలయం, ద్వారకా తిరుమల వారు, విశాఖజిల్లాలో ఉన్న  సింహాచలం  శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం,   వారు ఇచ్చిన అన్నదాన  ప్రకటనలు ఉన్న మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ ఇవి. 

అన్నవరం గుడి

Special Cover issued at EGNPEX-2009 ,KAKINADA on  Sri Veera Venkata Satyanarayana Swamy Temple, Annavaram.   Date Of Issue:- 26.06.2009. కాకినాడ లో జరిగిన తూర్పు గోదావరి జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శన (EGNPEX -2009 ) లో అన్నవరం  లో కొలువై ఉన్న  శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం యొక్క ప్రాముఖ్యత ను చాటి చెప్పటానికి ఒక ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేసారు.  మన రాష్ట్రం లో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన   శ్రీ సత్యనారాయణ స్వామి  ఆలయాన్ని  రత్నగిరి  అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 1934 లోనే జరిగినా స్వల్ప కాలంలోనే   చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది.

మంగళగిరి రాజ గోపురం

Set of 3 Special Covers issued in   GUNPEX 76 SRI  LAKSHMI NARASIMHA TEMPLE -RAJA GOPURAM   ( 1809 A.D.) MANGALAGIRI అమరావతి ప్రభువు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారిచే 1809 లో నిర్మంచిన మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయ గాలి గోపురం మన రాష్ట్రం లో ఉన్న వాటిలో అతిపెద్దది.  15 మీటర్లు (49ft ) వెడల్పు 46 .70 మీటర్లు ఎత్తు  (157ft )  తో పదకొండు అంతస్తుల ఈ గాలి గోపురం (రాజ గోపురం)  మన దేశం లో ఉన్న ఎత్తైన వాటిలో మూడవది.   మార్చ్ 13 -15 ,1976 లో గుంటూరు  జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శనలో (GUNPEX-76)  మంగళగిరి  రాజ  గోపురం  తో ఉన్న కవరు పై 3 ప్రత్యేక పోస్టల్  ముద్రలతో మూడు   తపాలా కవర్లు  విడుదలచేశారు.

శ్రీ వెంకటేశ్వర ఆలయం - బృందావన్ గార్డెన్స్ ,గుంటూరు

Guntur Numismaic and Philatelic Society celebrated its 15th Anniversary from 4th to 6th December, 2009 at Guntur. India Post released Three special covers on this occasion . గుంటూరు లో జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో మూడు ప్రత్యేక కవర్లు విడుదల చేశారు. గుంటూరు తిరుమల గా ప్రశిద్ది చెందిన బృందావన్ గార్డెన్స్  శ్రీ వెంకటేశ్వర ఆలయం పై ఒకటి, ఆ ఆలయ ప్రాంగణం లో ఉన్న అన్నమయ్య  కళా వేదికపై మరొకటి ప్రత్యేక కవర్లు విడుదల చేశారు. ప్రతి రోజు ఒక కార్యక్రం నిర్వహిచటంలో అన్నమయ్య  కళా వేదిక 'లిమ్క బుక్ అఫ్ రికార్డ్స్' లో చోటు సంపాదించుకుంది. వీటి తో పాటు గుంటూరు సమీపం లో ఉన్న ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం పై కుడా మరొక కవర్ విడుదల చేశారు. 1. 10th Anniversary-Sri Venkateswara Swamy Temple, Brundavan Gardens, Guntur Date Of Issue:-04.12.2009. 2. Annmayya Kala Vedika, Guntur Date Of Issue:-05.12.2009. 3. Uppalapadu Bird Sanctuary, Guntur Distrist Date Of Issue:-06.12.2009.

రాజ మహేంద్రవరం కోట

Special Cover-Rajamahendravaram Fort, Egnpex 2009, Kakinada . Date Of Issue:-28.06.2009 రాజమహేంద్రవరం  రాజధానిగా చేసుకొని ఆంద్ర ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళిక్యులలో రాజ రాజ నరేంద్రుడు (1022AD -1063AD ) ప్రముఖుడు.వీరి కాలంలోనే నన్నయ్య భారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కాకినాడలో జరిగిన EGNPEX -2009 లో రాజమహేంద్రవరం కోట (921AD -1580AD ) చాయా చిత్రం తో ఒక ప్రత్యేక కవర్ 28 -6 -2009 న విడుదల చేసారు. దీనికి తూర్పు చాళిక్యులు ఉపయోగించిన రాజముద్ర (615AD -1077AD ) ను పోస్టల్ క్యాన్సిలెషన్ గా వాడటం ముదావహం.

మన హాస్య నటులు - రేలంగి, సూర్యా కాంతం

Special Cover-Comedians Of Telugu Cinema,  Egnpex-2009, కాకినాడ, Date Of Issue:27.06.2009.   Relangi and Suryakantham, Comedians of Telugu Cinema మన తెలుగు వెండి తెర హాస్య నటులు - రేలంగి, సూర్యా కాంతం గౌరవార్దం తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ లో  (EGNPEX -2009) జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో 27-06-2009 న విడుదల చేసిన ప్రత్యేక పోస్టల్ కవరు మరియు ప్రత్యేక పోస్టల్ ముద్ర. ఈ కవరు పై మన ప్రముఖ దర్శకుడు బి.యన్.రెడ్డి తపాల బిళ్ళను చూడవచ్చు.

తపాలా బిళ్ళపై జగన్నాధుని రధ చక్రాలు

  COMMEMORATIVE POSTAGE STAMP ON RATH YATRA -PURI   ప్రతి ఏటా జరిగే ' పూరి  జగన్నాధుని  రధ యాత్ర ' పై మన తపాల శాఖ   12 -07 -2010 న ఒక తపాల బిళ్ళ ,దానితో పాటు ఒక మినిఎచార్ విడుదలచేసింది.

Stamps on Pigeon & Sparrow

పిచ్చుకలు - పావురాళ్ళు  మన  గుమ్మం  లో గంతులేసే పిచ్చుకలు,పావురాళ్ళు అంతరించి పోతున్న పక్షుల జాబితాలో చేరాయి.ఇక వాటిని మనం బొమ్మలలో చుసుకోవాలేమో ! రాబోయే ముప్పును నివారించే మార్గాల అన్వేషణలో తపాల శాఖా వారు ఈ పక్షులపై రెండు తపాల బిళ్ళలు మరియు ఒక మినిఎచార్ 09 -07 -2010 న విడుదల చేసారు. Miniature Sheet - Pigeon & Sparrow Date Of Issue : 09.07.2010.

MAHATMA GANDHI -3

"An eye for an eye makes the whole world blind."  MAHATMA GANDH మహాత్మా  గాంధీ  పై ప్రపంచంలో అనేక దేశాల వారు ప్రత్యేక తపాల బిళ్ళలను విడుదల చేసి ఆ అహింసా మూర్తికి ఘన నివాళి ఇచ్చారు. వాటిలో ఆంటిగువ & బార్బుడా దేశం వారు 1984 లో రెండు తపాల బిళ్ళలు విడుదల చేసారు. వాటిలో ఒకటి గాంధీ బొమ్మతోనూ మరొకటి 1931 లో గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తరువాత లండన్ నుండి ఫ్లోకేస్తోన్ కు రైలు లో ప్రయాణించే సమయాన రైలు కిటికిలో నుండి బయటికి చూస్తున్న గాంధీ గారి చిత్రం. ఇంకా గాంధిజీ తో ఆనాడు ప్రయాణం చేస్తున్న సరోజినీ నాయుడు, గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ ఉన్నారు. A set of two stamps issued in 1984 by  ANTIGUA & BARBUDA    MAHATMA GANDHI  AND   LEAVING LONDON BY TRAIN -1931  Mrs.Sarojini Naidu , who accompanied him to  Folkestone  is also shown looking out the train window ,others in this stamp are Gandhi personal assistant  Pyarelal and Madeline Shade . A SET OF TWO STAMPS ISSUED ON INDIAN NATIONAL PHILATELIC EXHIBITION -1970 ONE RUPEE STAMP SHOWS - BA- BAPU  Gandhi marchi

Mahatma Gandhi -2

Mahatma Gandhi Stamps Issued in 1948 on the  First Anniversary of Independence --------------------------------------------------------------------------------------- Issued in 1969 to mark  The Birth Centenary ________________________________________________ Issued in 1980 to commemorate the Dandi March  (Defiance of Salt Tax law) ______________________________ Issued in 1994 to mark  125th Birth Anniversary ________________________________ Issued in 1995 to mark  India - South Africa  Co-operation ________________________________ Issued in 1998 to mark the 50th Death  Anniversary ________________________________ Man of the Millennium  Issued in 2001 ________________________________ GANDHI AND NEHRU Issued in 1973 in commemoration AICC Quit India Resolution, August 1942  issued in 1983 - Indian Struggle for Freedom  ________________________________ Issued in 1979 to mark International Year of the

MAHATMA GANDHI

మహాత్మా గాంధీ పై విడుదలైన తపాల బిళ్ళలు మహాత్మా గాంధీ, మదర్ తెరిసా ,లింకన్,లూధర్ కింగ్ 60 YEARS OF UNIVERSAL DECLARATION OF HUMAN RIGHTS DATE OF ISSUE : 08 - 12- 2008 Mahatma Gandhi - Father of the Nation Issued in 2000 to mark the new Millennium And 50 years of the Republic of India Issued on 30th January,2000 ఇండియా, దక్షణ ఆఫ్రికా ల మధ్య సత్ సంభందాలు పెంపు కొరకు మహాత్మా గాంధీ పై మన తపాల శాఖ విడుదలచేసిన మొదటి మినీ ఎచరు : Issued in 1995 to mark India - South Africa Co-operation DATE OF ISSUE : 2 - 10 1995 CENTENARY OF SATYAGRAHA Date of Issue: 2-10- 2007 దక్షణ ఆఫ్రికాలో గాంధీ చేసిన సత్యాగ్రహం శత జయంతికి విడుదలైన మినిఏచర్ 75 YEARS OF SALT SATYAGRAHA date of issue : 5-04-2007 మహాత్మా గాంధీ ( దండి మార్చ్) ఉప్పు సత్యాగ్రహం చేసి 75 వసంతాలు నిడిన సందర్బం గా విడుదలైన మినిఏచర్

స్వామి రామానంద తీర్థ

Heros of Freedom Struggle SWAMI RAMANANDA TEERTH Date of Issue: 15 -08 -1999 స్వామి రామానంద ౧౯౦౩ (1903 - 1972) స్వాతంత్ర సమరయోధుడు , హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు , భారత పార్లమెంట్ సభ్యుడు , సన్యాసి . స్వామి రామానంద తీర్థ బాల్యనామం వెంకటేష్ భావు రావు ఖెడ్గేకర్ . ఈయన అక్టోబర్ 3, 1903 లో గుల్బర్గా జిల్లా , జాగిర్ గ్రామం లో జన్మించారు . లోకమాన్య బాల గంగాధర తిలక్ ‌ ను ఈయన ఆదర్శంగా తీసుకున్నాడు . వీరి గౌరవార్దం 15 - 08 - 1999 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదలైయింది .