Skip to main content

Posts

Showing posts from April, 2010

పోస్టల్ స్టాంప్ కు నోచుకోని " శ్రీ శ్రీ "

మహాకవి , తెలుగు తేజం శ్రీ శ్రీ గారి శత జయంతి ఉత్సావాలు రాష్ట్రమంతా ఘనంగా జరుగుతూ ముగింపుకు వచ్చాయి . ఆ మహాకవికి నివాళి గా భారత తపాల శాఖా ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేయక పోవటం చాల శోచనీయం . మన రాష్ట్ర ప్రభుత్వం గాని , శ్రీ శ్రీ శత జయంతి జరుపుతున్న అభిమాన సంస్థలు గాని పోస్టల్ స్టాంప్ విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి . ఆకాశ వీధుల్లో హడావుడిగా వెళ్ళే తెలుగు కవిత్వాన్ని భూ మార్గం పట్టించిన మహా కవికి ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసేలా మనం కృషి చేయాలి . ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఫిలాటాలి క్లబ్స్ వారు దీనికి పూనుకోవాలి . అలాగే ప్రాంతీయ పరిధిలో శ్రీ శ్రీ గారికి ప్రత్యేక కవరు , క్యాన్సిలేషన్ తో విడుదల చేసి వారికి ఘనంగా నివాళి ఇవ్వాలి . మన పొరుగున ఉన్న తమిళ వాళ్ళ ఫిలాటాలి క్లబ్స్ చూసి మన సంఘాలు ఉత్తేజం పొందుతారని ఆశిద్దాం . శ్రీ శ్రీ గారి చిత్రం శ్రీ ధరణీ రాయ్ చౌదరి సౌజన్యం తో .....

హైదరాబాద్ - చార్మినార్

A Commemorative postage stamp on 24 - 12 - 1900 CITIES OF INDIA - HYDERABAD ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల రాజధాని మన హైదరాబాద్ నగరము. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు ప్రసిద్ది. దేశంలో ఐదవ అతిపెద్ద మహానగరము.హైదరాబాదును మూసీ నది ఒడ్డున క్రీ.శ. 1590 లో కులీ కుతుబ్ షా నిర్మించాడు. 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కలరా వ్యాధి నుండి రక్షణ ఇస్తుందనే నమ్మకం తో 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడు. కుతుబ్ షా ప్రియురాలు భాగమతి పేరుతొ దీనికి భాగ్య నగరం అనే పేరు కుడా ఉంది . ఈ నగర ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ' సిటీస్ అఫ్ ఇండియా ' పేరుతొ 24 - 12 - 1900 న ఒక తపాల బిళ్ళ విడుదల చేసింది . ఈ స్టాంపుతో పాటు బికనేర్ , కటక్ నగరాల స్టాంపులు కుడా విడులైయ్యాయి . చార్మినార్, గోల్కొండ కోట, లంబాడి (బంజారా తెగ ) స్త్రీ తో నగర సంస్కృతి ని చూపించే ఈ తపాల బిళ్ళ వెల ఐదు రూపాయలు

తపాల బిళ్ళల పై రాశి చక్రం

A Commemorative postage stamps on Astrological Signs 14 - 04 - 2010 విజ్ఞానం ఎంత పెరిగినా జ్యోతిష్యానికి ఆదరణ లభిస్తూనే ఉంది. దాన్ని ఆవకాశం గా తీసుకుని డబ్బు దండుకునే వారి కోవలోకి మన తపాల శాఖా కుడా చేరింది. ఆకాశం లో కనిపించే నక్షత్రాలను మన పూర్వికులు 12 రాశులుగా విభాగించి వాటికి ... మేషం, వృషభం,మిధునం,కర్కాటం,సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీనం ...అనే పేరులతో పిలుస్తూవాటిని బట్టి మన జాతకాలను చెప్పేవారు. ఈ నాటికి వీటిని విశ్వసించే వారు చాల మంది ఉన్నారు. ఈ నక్షత్ర రాశులనువివిధ దేశాల వారు వివిధ పేరులతో పిలుస్తున్నారు.ఈ జ్యోతిష్య చిహ్నాలను చాల దేశాలు తపాల బిళ్ళల పై ముద్రించారు. మన తపాల శాఖా మన గ్రామీణ ప్రాంతాలలోప్రాచుర్యం పొందిన ఈరాసుల బొమ్మలను నాలుగు రంగులతో 12 తపాల బిళ్ళల పై ముద్రించారు. ఇలా ఒక అంశం పై ఒకే సారి 12 స్టాంపులు విడుదల చేయటం ఇదే ప్రధమం.ఈ 12 తపాల బిళ్ళను ఒకే షీటు లో ఉండే లా అందమైన ఒక మినియేచార్ కుడా విడుదల చేసారు. ప్రతి తపాల బిళ్ళ వెల 5/- రూపాయలు. మినియేచార్ వెల 60/- రూపాయలు.

తెన్నేటి విశ్వనాధం

A Commemorative postage stamp on 10 -11 -2004 TENNETI VISWANANATHAM తెన్నేటి విశ్వనాధం ( 1895 - 1979 ) స్వాతంత్ర్యపోరాట యోధుడు , మాజీ న్యాయ , దేవాదాయ మరియు రెవిన్యూ శాఖామంత్రి . విశాఖ పట్నం లో ఉక్కు కర్మాగారం నెలకొల్పటములో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి . మహాత్మా గాంధీచే ప్రభావితుడై స్వాతంత్ర్యోద్యమములో చేరి ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఐదు సార్లు జైలుకు వెళ్లాడు. 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికైనాడు. విశ్వనాథం 1951లో మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా కూడా పనిచేశాడు. నాలుగోవ లోక్ సభలో విశాఖ పట్నం కి ప్రతినిధిగా ఎన్నికైయ్యారు.వీరి గౌరవార్దం 10-11-2004 న భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారు.

కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు

A Commemorative postage stamp on 1 - 5 - 1969 KASINADUNI NAGRSWARA RAO PANTHULU దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతు లు ( 1867 - 1938 ) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంధాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను' కళా ప్రపూర్ణ ' బిరుదుతో సత్కరించింది. ఆంధ్ర ప్రత్రిక , అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక, భారతి , ఆంధ్ర గ్రంధాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండీ నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. శ్రీ భాగ్ వడంబిక వీరి నివాసం లో నే కుదిరింది . తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన విషయాలలో ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను 'దేశోధ్ధారక ' బిరుదుతో సత్కరించారు. వీరి గ

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

India Post relased a set of four Commemorative postage stamps on CENTENARY OF THE INDIAN NATIONAL CONGRESS  on 28-12-1985, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వంద వసంతాలు నిండిన సందర్భంగా 1985 లో నాలుగు (se-tenant) స్టాంప్స్ విడుదల చేసారు.  నూరు సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఆ పార్టీ కి అద్యక్షత వహించిన మన తెలుగు ప్రముఖుల చిత్రాలు వీటిలో ఉన్నాయి. 1.పి .ఆనందాచార్యులు . (1843-1908) : 1891 లో అధ్యక్షులు (పైన ఎడమ ప్రక్క మొదటి స్టాంపులో -మూడో వరుస,మూడో బొమ్మ)  2. భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880-1959): 1948,49 లో అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో - మొదటి వరస ,మూడోది)  3.నీలం సంజీవరెడ్డి (1913-1996) 1960-63 లో అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో- రెండవ వరస,మూడోది ) 4. దామోదరం సంజీవయ్య (1921-9171);  1962-64,1971-72 లలో రెండు సార్లు అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో- రెండవ వరస,నాలుగోది)  5. కాసు బ్ర హ్మా నంద రెడ్డి (1914-1994): 1978-79 లో అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో - చివరి వరుసలో మూడోది)   వీరిలో పట్టాభి సీతారామయ్య గారికి, దామ

డా.ఎల్లాప్రగడ సుబ్బారావు

Dr.YELLAPRAGADA SUBBAROW A Commemorative postage stamp on 19 - 12 - 1995 యల్లాప్రగడ సుబ్బారావు( 1895 - 1948 ) భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. వారి జన్మ స్థలం నేటి పచ్చిమ గోదావరి జిల్లా ,భీమవరం. హార్వర్డ్ స్కూల్ అఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ పైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు గారి పర్యవేక్షణలో బెమ్జిమిన్ డుగ్గర్ 1946 లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ అయిన ఆరియో మైసిన్ అనే మం దు కనుగొనెను. సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన వారు కనుగొనిన కొన్ని మందులను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది. కొత్తగా కనుగొనిన ఒక ఫంగస్ కు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ ( Subbaromyces splendens ) అని నామకరణము చేశారు. 1947 లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భా